ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 70,757 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,859 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1988910కు చేరింది. మరో 13 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13595 కు చేరింది. గడచిన 24 గంటల్లో 1,575 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య 1956627కు చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 18688 యాక్టివ్ కేసులున్నాయి. కాగా ఇప్పటివరకు 2,54,53,520 శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూర్ జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒక్కరు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 402 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 233, నెల్లూరు జిల్లాలో 225 కేసులు వెలుగుచూశాయి.
జిల్లాలవారీగా కేసుల వివరాలను దిగువన చూడండి
#COVIDUpdates: 12/08/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,86,015 పాజిటివ్ కేసు లకు గాను
*19,53,732 మంది డిశ్చార్జ్ కాగా
*13,595 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,688#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/UWZctpDGVZ— ArogyaAndhra (@ArogyaAndhra) August 12, 2021
కరోనా సమాచారం ఇక నుండి మీ చేతుల్లోనే:
● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి.
● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు
● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు
● https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వా రా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు.
● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. క్రింద లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.
https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19
Also Read: ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్‌పై ట్విస్ట్.. హైకోర్టుకు వెళ్లిన వ్యవహారం