ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 91,070 మందికి కరోనా పరీక్షలు కరోనా పరీక్షలు చేయగా, 2,982 మందికి వైరస్ సోకినట్లు తేలింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,14,213 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరో 21 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,946కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,850 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 4,019 మంది బాధితులు వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 18,69,417కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,26,99,142 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
#COVIDUpdates: 08/07/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,11,318 పాజిటివ్ కేసు లకు గాను
*18,66,522 మంది డిశ్చార్జ్ కాగా
*12,946 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,850#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/a4KaSITOPc— ArogyaAndhra (@ArogyaAndhra) July 8, 2021
కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో, అశ్రద్ద చేస్తూ.. జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. కొత్త వేరియంట్ల వ్యాప్తి పలు దేశాల్లో ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేయాలని చెబుతున్నారు.