బాలీవుడ్‌లో కరోనా టెర్రర్.. మరో హీరోయిన్ డ్రైవర్‌కు పాజిటివ్..

| Edited By:

Jul 14, 2020 | 12:30 PM

బాలీవుడ్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమితాబ్ బచ్చన్‌తో పాటు అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యలకు కోవిడ్ సోకిన విషయం తెలిసిందే. ఈ వార్తతో దేశంలోని అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అలాగే మరో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మినహా మిగతా కుటుంబ సభ్యులకు...

బాలీవుడ్‌లో కరోనా టెర్రర్.. మరో హీరోయిన్ డ్రైవర్‌కు పాజిటివ్..
Follow us on

బాలీవుడ్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమితాబ్ బచ్చన్‌తో పాటు అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యలకు కోవిడ్ సోకిన విషయం తెలిసిందే. ఈ వార్తతో దేశంలోని అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అలాగే మరో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మినహా మిగతా కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు కరోనాతో మరణించిన విషయం కూడా తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరో హీరోయిన్ సారా అలీ ఖాన్ కూడా చేరింది. తన డ్రైవర్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

‘తనతో పాటు మిగతా కుటుంబ సభ్యులు, ఇతర సిబ్బందికి కూడా కరోనా టెస్టులు జరిగాయని.. అదృష్టవశాత్తూ అందరికీ నెగిటివ్ వచ్చినట్లు పేర్కొంది. అలాగే మేమంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నాతో పాటు నా కుటుంబ సభ్యులందరి తరుపునా బీఎంసీకి కృతజ్ఞతలు తెలుపుతున్నా’.. అంటూ సారా అలీ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేసింది.