“మహా” విలయం.. రికార్డు స్థాయిలో కేసులు..

కరోనా మహమ్మారి మహారాష్ట్రలో విలయ తాండవం చేస్తోంది. రెండున్నర లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శనివారం నాడు కొత్తగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా..

మహా విలయం.. రికార్డు స్థాయిలో కేసులు..

Updated on: Jul 11, 2020 | 9:28 PM

కరోనా మహమ్మారి మహారాష్ట్రలో విలయ తాండవం చేస్తోంది. రెండున్నర లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శనివారం నాడు కొత్తగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా 8,139 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.46 లక్షలకు చేరింది. వీటిలో ప్రస్తుతం 99వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 4,360 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 223 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1.36 లక్షలకు చేరుకుంది. ఇక కరోనా బారినపడి 10,116 మంది మరణించారు. ముఖ్యంగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us