దేశంలో కొత్తగా 83,809 కేసులు, 1,054 మరణాలు..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 83,809 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,054 మరణాలు సంభవించాయి.

దేశంలో కొత్తగా 83,809 కేసులు, 1,054 మరణాలు..
Follow us

|

Updated on: Sep 15, 2020 | 10:18 AM

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 83,809 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,054 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 49,30,237కి చేరుకుంది. ఇందులో 9,90,061 యాక్టివ్ కేసులు ఉండగా.. 80,776 మంది కరోనాతో మరణించారు. అటు దేశంలో ఇప్పటివరకు 38,59,400 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇక అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల లిస్టులో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. మహారాష్ట్రలో 10 లక్షల 77 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. ఏపీలో 5,75,079.. తమిళనాడులో 5,08,511 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే నిన్న మహారాష్ట్రలో అత్యధికంగా 17,066 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశవ్యాప్తంగా  నిన్న ఒక్క రోజు 79,292 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 78.28 శాతం ఉండగా.. మరణాల రేటు 1.64 శాతంగా ఉంది.

Also Read:

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

‘కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి’

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…