కరోనా దెబ్బకు.. టూరిజం కుదేల్.. విమాన, హోటల్‌ చార్జీలు ఢమాల్‌..!

కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. కరోనా వైరస్‌ అనేక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా విమాన ప్రయాణాల ద్వారా ఈ మహమ్మారి మరింత

కరోనా దెబ్బకు.. టూరిజం కుదేల్.. విమాన, హోటల్‌ చార్జీలు ఢమాల్‌..!
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2020 | 7:48 PM

కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. కరోనా వైరస్‌ అనేక రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా విమాన ప్రయాణాల ద్వారా ఈ మహమ్మారి మరింత విజృంభించే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఇప్పటికే అనేక దేశాలు విమాన ప్రయాణాలను నిషేధించాయి. వీసాలను నిలిపివేసాయి. తాజా పరిణామాలు విదేశీ పర్యాటకుల రాకపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. పరిస్థితి మరింత దారుణంగా పరిణమిస్తోంది. దీంతో విమాన చార్జీలు దాదాపు 70 శాతం క్షీణించాయి. అలాగే హోటల్‌ రేట్లు సగటున 40 శాతం పడిపోయాయి.

అయితే.. గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో విమాన చార్జీలు ఇర్‌ఫేర్‌లు సగటున 40 శాతం, హోటల్ రేట్లు 18 శాతం తగ్గాయని తెలుస్తోంది. మార్చి 11 నాటికి ఢిల్లీ-ముంబై మార్గంలో ఛార్జీలు దాదాపు 70 శాతం తగ్గాయి.ముంబై-బెంగళూరు మార్గంలో ఛార్జీలు 45 శాతానికి పైగా తగ్గాయి. అయితే మార్చి 11 న ఢిల్లీ-గోవా ఛార్జీలు 8 శాతం పెరగడం గమనార‍్హం. ఇంతవరకూ గోవాలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకున్నవారు 35శాతంగా ఉన్నారు.