కరోనా…ఇండియా.. 24 గంటల్లో 49 మరణాలు.. పెరిగిన రీకవరీ రేటు

ఇండియాలో కరోనా వైరస్ కేసులు 20 వేలు దాటిపోయాయి. ఈ నెల 2 న కరోనా మహమ్మారి 210 జిల్లాల్లో ఉండగా.. 22 నాటికి ఇది 403 జిల్లాలకు విస్తరించింది. ఆరు మెట్రో నగరాల్లో దాదాపు 45 శాతం కేసులు నమోదయ్యాయి. బుధవారం 1486 కొత్త కేసులు నమోదు కాగా.. ఇది మొత్తం 20, 471  కి చేరింది. గత 24 గంటల్లో 49 మంది రోగులు మృతి చెందారు. ఒక్క రోజులో 618 మంది రోగులు […]

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 22, 2020 | 7:57 PM

ఇండియాలో కరోనా వైరస్ కేసులు 20 వేలు దాటిపోయాయి. ఈ నెల 2 న కరోనా మహమ్మారి 210 జిల్లాల్లో ఉండగా.. 22 నాటికి ఇది 403 జిల్లాలకు విస్తరించింది. ఆరు మెట్రో నగరాల్లో దాదాపు 45 శాతం కేసులు నమోదయ్యాయి. బుధవారం 1486 కొత్త కేసులు నమోదు కాగా.. ఇది మొత్తం 20, 471  కి చేరింది. గత 24 గంటల్లో 49 మంది రోగులు మృతి చెందారు. ఒక్క రోజులో 618 మంది రోగులు కోలుకున్నారని, రికవరీ రేటు 19. 36 శాతమని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు, ఇది మంచి శుభ సూచిక అన్నారు. లాక్ డౌన్ కారణంగా కరోనా వ్యాప్తి క్రమేపీ తగ్గుతోందన్నారు. లాక్ డౌన్ కి ముందు దీని వ్యాప్తి మూడు నుంచి నాలుగు రోజులు ఉండగా.. క్రమంగా ఏడున్నర రోజులకు పెరిగినట్టు ఆయన చెప్పారు. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, ఇండోర్, పూణే, జైపూర్ నగరాల్లో 45 శాతం కేసులు నమోదైనట్టు ఆయన చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో 60 శాతం పైగా కేసులు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు.