Telangana Corona Update: తెలంగాణలో కరోనా కేసుల నమోదు నిలకడగా సాగుతుంది. గత 24 గంటల్లో 38,192 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 331 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,640కి చేరుకుంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,571కి చేరింది. కరోనాబారి నుంచి 394 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,84,611కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,458 ఉండగా వీరిలో 2,461 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 73,50,644 కరోనా పరీక్షలు నిర్వహించామని వైద్య అధికారులు తెలిపారు.