Supreme court ప్రతీ ఇంటిలో కరోనా టెస్టులు.. సుప్రీం ఏం చెప్పిందంటే?

దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటిలో కరోనా టెస్టులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో శుక్రవారం ఓ పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటి సర్వే పేరిట కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు చర్యలు ప్రారంభించాయి.

Supreme court ప్రతీ ఇంటిలో కరోనా టెస్టులు.. సుప్రీం ఏం చెప్పిందంటే?
Follow us

|

Updated on: Apr 10, 2020 | 1:35 PM

Supreme Court on house-wise corona tests: దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటిలో కరోనా టెస్టులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో శుక్రవారం ఓ పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటి సర్వే పేరిట కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు చర్యలు ప్రారంభించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కూడా ప్రతీ ఇంటి సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పటికే రెండు విడతల ఇంటింటి సర్వే పూర్తి కాగా… మూడో విడత సర్వేకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో దేశంలోని ప్రతీ ఇంటిలోని ప్రతీ ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలంటూ సుప్రీంకోర్టులో శుక్రవారం ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారణకు స్వీకరించింది అత్యున్నత న్యాయస్థానం. కరోనా వైరస్ వ్వాప్తి ని తగ్గించడానికి ఇంటింటిలో కరోనా పరీక్షలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దారుడు సుప్రీంకోర్టును కోరారు. హాట్‌స్పాట్‌లుగా ఉన్న ప్రాంతాలలో కరోనా సోకిన వారిని గుర్తించి.. వారికి చికిత్స అందించేలాగా.. చూడాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

కరోనా టెస్టు కిట్స్ స్థానికంగా తయారు చేస్తున్నందున భవిష్యత్తులో వైరస్ వ్యాప్తి చెందకుండా వుండాలంటూ ప్రతీ ఇంటిలోను, ప్రతీ ఒక్క పౌరునికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్నది పిటిషన్ సారాంశం. ప్రతీ ఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తే.. ఆ తర్వాత లాక్ డౌన్ అవసరం తలెత్తదని, కేవలం విదేశీయులు వచ్చే ఎయిర్ పోర్టులు, సీ పోర్టుల్లో వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చాలన్నది పిటిషన్ దారుడు సుప్రీంకోర్టులో ప్రస్తావించిన ప్రధానాంశం.