తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న క‌రోనా, తాజాగా

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా విజృంభిస్తోంది. గ‌త రెండు మూడు రోజులుగా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతూ పోతోంది. రోజుకు ప‌దుల సంఖ్య‌లో కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గంట‌గంట‌కు మారుతున్న వైర‌స్ స‌మీక‌ర‌ణాలు గుబులు రేపుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న క‌రోనా, తాజాగా
Follow us

|

Updated on: Apr 19, 2020 | 9:30 AM

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా విజృంభిస్తోంది. గ‌త రెండు మూడు రోజులుగా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతూ పోతోంది. రోజుకు ప‌దుల సంఖ్య‌లో కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గంట‌గంట‌కు మారుతున్న వైర‌స్ స‌మీక‌ర‌ణాలు గుబులు రేపుతున్నాయి. దీంతో ఇరురాష్ట్రాల ప్ర‌భుత్వాలు మ‌రింత అప్ర‌మ‌త్తంగా నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఇటు, తెలంగాణ‌, అటు ఏపీలో క‌లిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య సుమారుగా 15 వంద‌ల‌కు చేరింది.
తెలంగాణ:
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది..రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం కేసుల  సంఖ్య 809 కి చేరుకుంది. తెలంగాణ ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం శ‌నివారం రాత్రి వ‌ర‌కు తెలంగాణలో మొత్తం 43 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 31 కేసులు గ్రేటర్ పరిధిలోనే న‌మోదుకావ‌టం గ‌మ‌నార్హం. అయితే, శ‌నివారం రోజున చికిత్స పొందుతున్న వారిలో ఎవరూ డిశ్చార్జ్ కాలేదు. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.  లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో  ఉండరాదని, ప్రతి ఒక్కరి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ నిన్న మ‌రోమారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్:
ఇక‌, ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 608కి చేరుకుంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 15కు పెరిగింది. రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. కర్నూలు జిల్లాలో 129, గుంటూరు జిల్లాలో 126 మంది కరోనా బారిన పడ్డారు. అనంతపురం 26 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఇద్ద‌రు మృత్యువాత ప‌డ్డారు. చిత్తూరు 30, తూ.గోదావరి  24, గుంటూరు 126 కేసులు న‌మోదు కాగా, 04 మ‌ర‌ణించారు. కడప 37, కృష్ణా  జిల్లాలో 70 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఐదు మ‌ర‌ణాలు సంభ‌వించాయి. కర్నూలు   129 వీరిలో 2 మ‌ర‌ణాలు,  నెల్లూరు లో 67 కేసులు రెండు మ‌ర‌ణాలు, ప్రకాశం 44, విశాఖలో 20 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాలు ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాకు దూరంగా ఉన్నాయి.