కరోనా.. మహారాష్ట్రలో అధికం.. కేరళలోనూ పెరిగిన కేసులు

ఇండియాలో కరోనా కేసులు 275 కి పెరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా మహారాష్ట్రలో 53 కేసులు, కేరళలో 40 కేసులు నమోదయ్యాయి

కరోనా.. మహారాష్ట్రలో అధికం.. కేరళలోనూ పెరిగిన కేసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 21, 2020 | 2:05 PM

ఇండియాలో కరోనా కేసులు 275 కి పెరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా మహారాష్ట్రలో 53 కేసులు, కేరళలో 40 కేసులు నమోదయ్యాయి. పంజాబ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు బయటపడ్డాయి. ఈ నెల 21 వరకు ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు కరోనాకు    గురై మరణించారని, అయితే పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ఫలితంగా ఈ వైరస్ కి గురై చికిత్స పొంది డిశ్చార్జి అవుతున్న రోగులు కూడా ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ గా ఉన్న కేసులు 231 అని, 22 మందికి పాజిటివ్ అని తేలినప్పటికీ వారు డిశ్చార్జి అయ్యారని ఈ శాఖవర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ట్రలో అయిదుగురు, ఢిల్లీలో మరో అయిదుగురు కూడా చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయినట్టు తెలిసింది. ఢిల్లీలో 26 కేసులు, యూపీలో 25, రాజస్థాన్ లో 23, తెలంగాణాలో 20, హర్యానాలో 17, కర్ణాటకలో 16, లడఖ్ లో 13, గుజరాత్ లో 8, చండీగఢ్ లో 5,  జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నాలుగు చొప్పున కేసులు నమోదయ్యాయి. తాజాగా  ఏపీ, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదు కాగా. తమిళనాడులో ఒకరు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. హిమాచల్, ఒడిశా రాష్ట్రాల్లో రెండు, పుదుచ్ఛేరి, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఒక్కొకటి చొప్పున నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది.