Ali and Naresh New Year Wishes : వినూత్నంగా విషెస్ తెలిపిన అలీ, నరేష్ .. ఏం చేసారంటే..

 కొత్తసంవత్సరం లోకి మరి కొన్ని గంటల్లో అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది కరోనా కలకలం తో జనజీవనం అతలాకుతలం అయింది. వచ్చే...

Ali and Naresh New Year Wishes : వినూత్నంగా విషెస్ తెలిపిన అలీ, నరేష్ .. ఏం చేసారంటే..
Follow us

|

Updated on: Jan 01, 2021 | 3:07 PM

Ali and Naresh New Year Wishes : కొత్తసంవత్సరం లోకి మరి కొన్ని గంటల్లో అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది కరోనా కలకలం తో జనజీవనం అతలాకుతలం అయింది. వచ్చే ఏడాదైనా అంతా మంచే జరగాలని అంతా కోరుకుంటున్నారు. తాజాగా నటుడు నరేష్ , కమెడియన్ అలీ ప్రజలకు వినూత్నంగా కొత్తసంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలీ నిర్మాత‌గా అలీవుడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ప‌తాకంపై ఇటీవల ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నారు బాగుండాలి అందులో నేనుండాలి అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఈ సినిమాలో అలీతో పాటు, విజ‌య‌కృష్ణ న‌రేశ్ కూడా ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా నరేష్ తో కలిసి అలీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. క‌రోనా నేప‌థ్యంతో 2020లో అతలాకుత‌ల‌మైన అంద‌రి జీవితాలు రాబోయే 2021లో కోలుకోవాల‌ని, ఈ కొత్త ఏడాది అంద‌రికి మంచి చేకూర్చాల‌ని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.