గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో… ఒకే ఓవర్‌లో 32 పరుగులు!

గ్లోబల్ టీ20 లీగ్‌లో వాంకోవర్ నైట్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న గేల్.. శుక్రవారం ఎడ్మంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 44 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. 20 ఏళ్ల పాక్  స్పిన్నర్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో గేల్ శివమెత్తాడు. అతడి ఓవర్‌లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన గేల్ ఆ తర్వాత రెండు బంతులను బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో […]

గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో... ఒకే ఓవర్‌లో 32 పరుగులు!
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 6:21 PM

గ్లోబల్ టీ20 లీగ్‌లో వాంకోవర్ నైట్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న గేల్.. శుక్రవారం ఎడ్మంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 44 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. 20 ఏళ్ల పాక్  స్పిన్నర్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో గేల్ శివమెత్తాడు. అతడి ఓవర్‌లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన గేల్ ఆ తర్వాత రెండు బంతులను బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో ఆ ఒక్క ఓవర్‌లోనే ఏకంగా 32 పరుగులు వచ్చాయి.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎడ్మంటన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఎడ్మంటన్ ఆటగాడు బెన్ కటింగ్ 41 బంతుల్లో 3 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. అనంతరం 166 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వాంకోవర్ జట్టు గేల్ దెబ్బకు 16.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.