కరోనా.కరోనా.. ఇండియాకు చైనా బాసట.. 6.5 లక్షల మెడికల్ కిట్స్ సరఫరా

ప్రపంచ దేశాలను  కరోనా మహమ్మారి సన్నిహితం చేస్తోంది.  కరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ ని అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలకు ఇండియా పంపగా.. తాజాగా చైనా 6.5 లక్షల పర్సనల్ ఈక్విప్ మెంట్ కిట్స్ ను ఇండియాకు పంపింది.

కరోనా.కరోనా.. ఇండియాకు చైనా బాసట.. 6.5 లక్షల మెడికల్  కిట్స్ సరఫరా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 16, 2020 | 12:54 PM

ప్రపంచ దేశాలను  కరోనా మహమ్మారి సన్నిహితం చేస్తోంది.  కరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ ని అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలకు ఇండియా పంపగా.. తాజాగా చైనా 6.5 లక్షల పర్సనల్ ఈక్విప్ మెంట్ కిట్స్ ను ఇండియాకు పంపింది. వీటితో కూడిన విమానం గురువారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరింది. బీజింగ్ లోని భారత రాయబారి విక్రమ్ మిశ్రా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. వచ్ఛే 15 రోజుల్లో 20 లక్షల టెస్ట్ కిట్స్ కూడా ఇండియాకు చేరనున్నాయని ట్వీట్ చేశారు. ఈ ఆరున్నర లక్షల పీపీఈలలో రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్స్, ఆర్ ఎన్ ఏ ఎక్స్ ట్రాక్షన్ కిట్లు కూడా ఉన్నాయన్నారు. గ్వాంగ్ జూ విమానాశ్రయం నుంచి ఈ విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరినట్టు ఆయన పేర్కొన్నారు. ఇండియాతో బాటు ఇతర దేశాలకు కూడా పీపీఈలను, వెంటిలేటర్లను చైనా పంపుతోంది. ఇటీవలే రెండు భారీ మెడికల్ కిట్స్ ను కూడా పంపిన విషయం విదితమే.

భారత్ లో కరోనా వైరస్ కు 12,380 మంది గురి కాగా.. మృతుల సంఖ్య 414 కి పెరిగింది. తమకు 30 లక్షల టెస్టింగ్ కిట్స్, 15 మిలియన్ల పీపీఈ లను పంపాలని భారత ప్రభుత్వం చైనా ప్రభుత్వాన్ని కోరింది. కాగా అస్సాం రాష్ట్రానికి చైనా నుంచి 50 వేల పీపీఈలు అందాయి.