Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • వేర్‌హౌజ్‌లో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్. జాగ్రత్తలు తీసుకోకుండా నిల్వచేయడమే కారణమని లెబనాన్ అధ్యక్షుడు మైఖేల్ ఔన్ ట్వీట్. సమగ్ర దర్యాప్తు చేపట్టిన సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ . బాధ్యులపై తీవ్రమైన చర్యలు, కఠిన శిక్షలు అమలు చేస్తామని వెల్లడి . పేలుడు ధాటికి పూర్తిగా ధ్వంసమైన బీరుట్ పోర్ట్. అత్యవసర నిధి కింద 100 బిలియన్ లీరాలు విడుదల చేసిన లెబనాన్ అధ్యక్షుడు. లెబనాన్‌కి 240 కి.మీ దూరంలోని సైప్రస్ దీవుల వరకు వినిపించిన పేలుడు శబ్దాలు. పేలుళ్లు 3.4 తీవ్రత కల్గిన భూకంపాన్ని సృష్టించాయని నిపుణుల అంచనా. వ్యవసాయంలో ఎరువుగా ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్‌కు నిప్పు తగిలితే అత్యంత తీవ్రతతో పేలుతుంది. పేలుడుతో నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియా వంటి విషవాయువులు విడుదల.
  • తిరుపతి...పేరూరు వకుళామాత ఆలయంలో చారిత్రాత్మిక శాసనం లభ్యం. 1101 వ శతాబ్దం కిచేందిన శాసనంగా గుర్తించిన పురావస్తు శాఖ అధికారులు. విష్ణు మూర్తి అలయంతో పాటు, అమ్మవారి ఆలయం ఉన్నట్టు చెప్తున్న శాసనం. టిటిడి ఇప్పటివరకు వకుళామాత ఆలయానికి సంభందించి ఎప్పుడు దొరకనట్టువంటి చారిత్రక ఆధారాలు.. తొలిసారిగా శాసనం బయటపడినా దానిపై పూర్తి సమాచారం సేకరిస్తున్న పురవస్తూశాఖ అధికారులు.
  • పేరూరు వకులమాత ఆలయంలో దొరికిన1101 శతాబ్దపు శాసనాలను పరిరక్షిస్తున్న అధికారులు. బండరాళ్లపై శాసనం ఉండటంతో దాని చుట్టూ కాంక్రీట్ దిమ్మను నిర్మిస్తున్న అధికారులు. వందల ఏళ్ల తర్వాత అమ్మవారి ఆలయానికి సంబంధించి దొరికి న శాసనం.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం : 554.60 అడుగులు. ఇన్ ఫ్లో : 40,150 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో : 2200 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ : 215.5430 టీఎంసీలు.
  • కాంగ్రెస్ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ సిఎం శివాజీరావు పాటిల్ నీలంగేకర్ పూణేలో కన్నుమూశారు.
  • చెన్నై విమానాశ్రయం లో భారీ గా పట్టుబడ్డ బంగారం , ఇద్దరు అరెస్ట్ . దుబాయ్ - షార్జా నుండి చెన్నై అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించినచిన కస్టమ్స్ అధికారులు . పట్టుబడ్డ 1 .48 కేజీల బంగారం విలువ 82 లక్షలు . చెన్నై కి చెందిన ఖలీల్ అహమద్ ,కాజా మొయిద్దీన్ అరెస్ట్ విచారణ చేపట్టిన కస్టమ్స్ అధికారులు.

పాలమూరు ఫిష్ తింటున్నారా ? అయితే అంతే సంగతి !

dangerous fish farms in mahabubnagar, పాలమూరు ఫిష్ తింటున్నారా ? అయితే అంతే సంగతి !

చేపలు తింటే ఆరోగ్యం.. చక్కగా మటన్, చికెన్ తగ్గించేసి ఎంచక్కా చేపలు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. నాన్ వెజ్ తిన్నామన్న ఎంజాయ్ చేశామన్న తృప్తి అనుకుంటున్నారా ? అయితే.. మీరు పప్పులో కాలేసినట్లే.. కాదు పులుసులో కాలేసినట్లే. రుచిగా వుందని ఎక్కడి నుంచి వచ్చిందో.. ఏం తిని వాటిని పెంచారో తెలుసుకోకపోతే.. అంతే సంగతులు అంటున్నారు పరిశోధకులు. మరీ ముఖ్యంగా పాలమూరు (మహబూబ్‌నగర్) జిల్లా నుంచి క‌ష్ణా నదీ పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన చేపలు తిన్నారా మీ సంగతి మటాషే. ఇంతకీ ప్రమాదం ఏంటనే కదా మీ ప్రశ్న.. రీడ్ దిస్..

చికెన్, మటన్‌తో పోల్చుకుంటే చేపల్లో ఫ్యాట్ తక్కువగా ఉంటుందంటారు. అన్ని రకాల పోషకాలు అందులో ఉంటాయి. అందుకే ఈ మధ్య కాలంలో చేపలపై మక్కువ చూపుతున్నారు జనం. మార్కెట్ లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న ఈ చేపలను ఎలా పెంచుతున్నారు ? ప్రజల నమ్మకాన్ని ఎలా వమ్ము చేస్తున్నారు? వాటికి మేత ఏం వేస్తున్నారో తెలిస్తే షాక్ అవకతప్పనిపరిస్థితి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందీ దందా. కృష్ణానది తీరంలో గత 12 సంవత్సరాలుగా సాగుతున్న ఈ దందాను ఫిష్ మాఫయా ఏలుతోంది. గతంలో ఈ చెరువుల్లో పెద్ద ఎత్తున క్యాట్ ఫిష్ పెంచే వారు…వాటి పెంపకంపై నిషేధం విధించడంతో ఆ చెరువుల్లో ప్రస్తుతం ఇతర చేపలు, అక్కడక్కడా క్యాట్ ఫిష్ కూడా పెంచుతున్నారు.

dangerous fish farms in mahabubnagar, పాలమూరు ఫిష్ తింటున్నారా ? అయితే అంతే సంగతి !

ప్రతి ఆదివారం ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో టన్నుల కొద్ది చేపలు వస్తున్నాయి. రకరకాల చేపలను విక్రయిస్తుంటారు. నిగనిగ లాడే చేపలు కన్పించగానే టక్కున తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఆ చేపలు ఎలా పెరిగాయో తెలిస్తే ఇక అంతే సంగతులు. చేపలు అన్ని రకాల వయస్సు వారికి ఉపయోగకరం. ముఖ్యంగా గుండె సంబంధిత జబ్బులు, షుగర్, బిపి ఉన్న వారికి చేపల చాలా మంచిది. అందుకే జనం చేపలపై మనస్స్సు పారేసుకుంటున్నారు.

dangerous fish farms in mahabubnagar, పాలమూరు ఫిష్ తింటున్నారా ? అయితే అంతే సంగతి ! dangerous fish farms in mahabubnagar, పాలమూరు ఫిష్ తింటున్నారా ? అయితే అంతే సంగతి !

దీన్ని ఆసరాగా చేసుకొని కొంత మంది వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా చేసుకొని ప్రజల ప్రాణాలతో ఆడుతున్నారు. ముఖ్యంగా జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. స్థానికుల నుంచి అధికారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మరో వైపు అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.

కానీ ఫిష్ మాఫియా మాత్రం వేలాది ఎకరాల్లో చెరువులు తవ్వేస్తున్నారు. అలాగనీ వ్యవసాయం అభివృద్ధి చెందుతుందా..లేక మంచి చేపలు పెంచుతున్నారా… అంటే అదీ లేదు. జీవ వ్యర్థాలతో చేపలను పెంచి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతోంది..ఈ ఫిష్ మాఫియా. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే విమర్శలూ వస్తున్నాయి. గతంలో ఈ చెరువుల్లో క్యాట్ ఫిష్ పెంచే వారు…ప్రస్తుతం ఫిష్ మాఫియా స్టైల్ మార్చింది. క్యాట్ ఫిష్ పెంచడం కన్నా ఇతర రకాల చేపలు పెంచడంలో మజా ఉందనుకుంది. అందుకే ఫంగస్ జెల్లా రకం చేప, క్యాట్ ఫిష్, తెల్లచేపలతో పాటు పలు ఇతర రకాల చేపలు పెంచుతున్నారు.

చెరువుల్లో, నదుల్లో చేపలైతే వాటికి నచ్చిన రకరకాల సహజమైన ఆహారాన్ని తింటాయి. సహజసిద్ధంగా పెరుగుతాయి. కానీ కృత్రిమంగా ఏర్పాటు చేసిన చెరువుల్లో చేపలకు అలాంటి ఆహారం దొరకదు కాబట్టి నిర్వాహకులు దాణా వేస్తారు. అచ్చంగా దాణా వేసినట్లయితే లాభాలు తక్కువగా వస్తాయి. అందుకే జీవవ్యవర్థాలను వాటికి వేస్తున్నారు ఫిష్ మాఫియా సభ్యులు. హైదరాబాద్, కర్నూలు వంటి నగరాల నుంచి చికెన్ వేస్టును తెచ్చి వాటిని ఉడకబెట్టి..ఆతర్వాత చేపలకు వేస్తున్నారు. ఉడకబెట్టిన కోళ్ల పేగులు, కాళ్లు, తలలను అవి ఏం చక్కా తినేస్తున్నాయి. దీని వల్ల వ్యాపారికి దాణా ఖర్చు తగ్గుతుంది. చేప త్వరగా పెరిగి వస్తుంది.

dangerous fish farms in mahabubnagar, పాలమూరు ఫిష్ తింటున్నారా ? అయితే అంతే సంగతి !

కానీ ఆ వ్యర్థాలను తిని పెరిగిన చేపను తింటే మనుషులకు రోగాలు తప్పవు. ప్రజల ఆరోగ్యం గురించి పట్టని ఫిష్ మాఫియా యదేచ్ఛగా చికెన్ వ్యర్థాలను చేపలకు మేతగా వేస్తున్నారు. చేపల చెరువు వద్దకు వెళ్లిన టివి9కు ఆశ్చర్యకరమైన పరిస్థితులు కనిపించాయి. ఇదేంటని అడిగితే వారి నుంచి సమాధానం భిన్నంగా వచ్చింది . చేపలకు చికెన్ వేస్టు వేసి పెంచుతున్నారా అని అడిగిన ప్రశ్నకు బదులుగా…తాము చికెన్ వేయడం లేదని ఓ వ్యాపారి చెబుతున్నా, అతని చెరువులోనే చికెన్ వ్యర్థాలు నీటిపై తేలుతూ కనిపించాయి.

dangerous fish farms in mahabubnagar, పాలమూరు ఫిష్ తింటున్నారా ? అయితే అంతే సంగతి !

అయితే మరో చెరువు వద్ద చికెన్ వ్యర్థాలను ఉడకబెట్టి చేపలకు మేతగా వేస్తున్నామని బాహాటంగానే చెబుతున్నాడు మరో వ్యక్తి.
జోగులాంబ గద్వాల జిల్లాలో 13 వందల ఎకరాల్లో చేపల చేరువులున్నాయి. ముఖ్యంగా ఇటిక్యాల మండలంలోనే 550 చెరువులున్నాయి. అలంపూర్,గద్వాల,కొల్లాపూర్,మక్తల్ ప్రాంతాల గుండా కృష్ణానది ప్రవహిస్తుంది.

నదీ పరీవాహక ప్రాంతాల్లోని పొలాలను చేపల చేరువులుగా మార్చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఈ చెరువులను లీజుకు తీసుకుంటున్నారు. ఎకరా చెరువుకు సంవత్సరానికి ముప్పై వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా ఈ మాఫియా ఇక్కడ తిష్టవేసి ఉంది. వ్యవసాయానికి వాడాల్సిన నీటిని నీటిని చెరువులకు మళ్లీస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా చేపల చెరువులను తవ్వేస్తున్నారు. అంతేగాక ఈ చెరువుల్లో చికెన్ వేస్టు వేసి చేపలు పెంచుతుండడంతో చుట్టుపక్కల పొలాలు కలుషితమౌతున్నాయి.

పైగా ముక్కుపుటాలు పగిలేలా దుర్వాసన వస్తోంది. గొర్రెలు, పశువులను మేపుకోలేక పోతున్నామని, ఇటు వైపు నుంచి వెళుతుంటే కంపు వాసన వస్తోందని, రోగాల పాలౌతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఏడు వందల చేపల చెరువులున్నాయని, వాటిలో జెల్లా, జొచ్చ వంటి చేపలు పెంచుతున్నారని…పలు చోట చికెన్ వ్యర్థాలు మేతగా వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు ఫిషరీస్ అధికారులు.

 

Related Tags