తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించింది. కాగా ఇప్పటికే ఆయన ప్రభుత్వ విప్‌గా కూడా నియమితులయ్యారు. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించింది. 13 అసెంబ్లీ సీట్లతోపాటు రెండు ఎంపీ సీట్లను కూడా పార్టీ కైవసం చేసుకుంది. కాగా ప్రాంతీయ సమతౌల్యం పాటిస్తూ […]

తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2019 | 1:05 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించింది. కాగా ఇప్పటికే ఆయన ప్రభుత్వ విప్‌గా కూడా నియమితులయ్యారు. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించింది. 13 అసెంబ్లీ సీట్లతోపాటు రెండు ఎంపీ సీట్లను కూడా పార్టీ కైవసం చేసుకుంది. కాగా ప్రాంతీయ సమతౌల్యం పాటిస్తూ సీఎం జగన్‌ మంత్రివర్గ కూర్పులో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారు.