హుజూర్ నగర్ పై బాబు నజర్.. టార్గెట్ హస్తమేనా ?

హైదరాబాద్ లో మకాం వేసిన టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై పార్టీ వర్గాలతో సమాలోచనలు జరపడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి.. కూటమిలో కొనసాగిన చంద్రబాబు నాయుడు ఈసారి కాంగ్రస్ పార్టీపై పోటీకి దిగడం చర్చనీయాంశమైంది. నిరుడు నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి మద్దతివ్వడంతో ఉత్తమ్  కుమార్ రెడ్డి విజయం నల్లేరు మీద నడకే అయ్యింది. ఆ తర్వాత జరిగిన […]

హుజూర్ నగర్ పై బాబు నజర్.. టార్గెట్ హస్తమేనా ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 05, 2019 | 5:56 PM

హైదరాబాద్ లో మకాం వేసిన టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై పార్టీ వర్గాలతో సమాలోచనలు జరపడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి.. కూటమిలో కొనసాగిన చంద్రబాబు నాయుడు ఈసారి కాంగ్రస్ పార్టీపై పోటీకి దిగడం చర్చనీయాంశమైంది. నిరుడు నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి మద్దతివ్వడంతో ఉత్తమ్  కుమార్ రెడ్డి విజయం నల్లేరు మీద నడకే అయ్యింది.

ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా టిడిపి, కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగింది. అయితే టిడిపి మద్దతుతో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న తరుణంలో మిత్ర ధర్మం ప్రకారం టిడిపి.. కాంగ్రెస్ పార్టీకే మద్దతు ప్రకటించాల్సి వుంది. కానీ చంద్రబాబు అనూహ్య నిర్ణయంతో టిడిపి అభ్యర్థిని బరిలోకి దింపారు. చావా కిరణ్మయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా హుజూర్ నగర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

అయితే చంద్రబాబు నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి షాకే అయినా.. అదేమీ పట్టనట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు టిఆర్ఎస్ అభ్యర్థిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. కానీ చంద్రబాబు వ్యూహం ఏంటన్న అంశం మాత్రం ఇపుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శుక్రవారం హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు శనివారం తెలంగాణ టిడిపి నేతలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ప్రధానంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలానికి ఒక రాష్ట్ర స్థాయి నేతను ఇంచార్జీగా నియమించారు చంద్రబాబు.  తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట ప్రభాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, భూపాల్ రెడ్డి, దుర్గ ప్రసాద్ , బక్క నర్సింహులులను హుజూర్ నగర్ కు పార్టీ బాధ్యులుగా చంద్రబాబు నిర్ణయించారు.

ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నిర్ణయం అధికార టిఆర్ఎస్. పార్టీకి కలిసొచ్చేలా వుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి మరలడం ఉత్తమ్ కుమార్ రె కలిసొచ్చింది. ఇపుడు టిడిపి ఓట్లు చీలే అవకాశం వుంది. కాంగ్రెస్ పార్టీతో అంటకాగడం ఏపీలో టిడిపిని దెబ్బకొట్టిందని భావిస్తున్న చంద్రబాబు.. హుజూర్ నగర్లో పోటీకి దిగడం ద్వారా కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి దోస్తీ లేదని చెప్పినట్లు అయ్యింది. అదే సమయంలో తెలంగాణలో పార్టీ ఇంకా బతికే వుందని చాటేందుకు కూడా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని వుండొచ్చన టిడిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

ఉప ఎన్నికకు ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చంద్రబాబును అస్సలు పరిగణలోకి తీసుకోకపోవడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించడం వల్లనే హుజూర్ నగర్ బరిలో టిడిపి అభ్యర్థిని బాబు దింపారని కూడా తెలుగుదేశం పార్టీలోకి ఒక వర్గం అభిప్రాయపడుతోంది. ఏది ఏమైనా బాబు నిర్ణయంతో కాంగ్రెస్ కు శాపం.. గులాబీ పార్టీకి లాభంలా మారిందని సగటు ప్రజానీకం చెప్పుకుంటున్నారు.