Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

చంద్రబాబులో సడన్ ఛేంజ్.. షాక్‌లో టిడిపి క్యాడర్ !

chandrababu changed attitude, చంద్రబాబులో సడన్ ఛేంజ్.. షాక్‌లో టిడిపి క్యాడర్ !

చంద్రబాబు మారారు? నిజమే మీరు చదివింది నిజమే.. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మారిపోయారు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు. టీడీపీ కార్యకర్తలే. మా బాబు ఇలా ఉంటే చాలు…పార్టీకి పునర్వైభవం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇంతకీ.. చంద్రబాబు ఏం మారారు? ఎలా మారిపోయారు ? అలా మారిపోయి కార్యకర్తలకు ఏం చెబుతున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా సమీక్ష సమావేశంలో ఏం జరిగింది? రీడ్ దిస్ స్టోరీ.

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమిపై సోమ, మంగళవారాల్లో సమీక్షలు జరిపారు. నియోజకవర్గంలో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి? అనేది తెలుసుకుంటున్నారు. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉంటారు? ఎవరు పోతారు అనే విషయంపై కూడా చంద్రబాబు ఫోకస్‌ పెట్టారట. సమీక్షలో భాగంగా చంద్రబాబు ఈ ఆపరేషన్‌ కూడా నిర్వహిస్తున్నారట.

ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత దేవినేని అవినాష్‌ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో పార్టీకి ఏ ఏ నేతలు దూరంగా ఉంటున్నారు అనే వివరాలను చంద్రబాబు సేకరిస్తున్నారట. పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజుల సమీక్ష సమావేశంలో కూడా చంద్రబాబు ఈ విషయంపై ఫోకస్‌ పెట్టారట. జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లలో టీడీపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచింది. 13 సీట్లు కోల్పోయింది. ఇక్కడ పార్టీని బలోపేతం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇక్కడ నాయకత్వం యాక్టివ్‌గా ఉందా? లేదా అనే విషయాన్ని ఆయన పరిశీలిస్తున్నారట.

మరోవైపు సమీక్ష సమావేశాల్లో చంద్రబాబు ధోరణిని చూసిన కార్యకర్తలు ఇప్పుడు ఓ విషయంలో తెగ సంబరపడిపోతున్నారు. ఇంతకుముందు చంద్రబాబు మీటింగ్‌ అంటేనే కార్యకర్తలు భయపడిపోయేవారట. సమీక్షల పేరిట ఆయన గంటలు గంటలు సాగదీసేవారని చెబుతుంటారు. మైకు అందుకున్నారంటే గంటన్నరకు పైగా మాట్లాడేవారని.. దాంతో చెప్పిందే చెప్పి చంద్రబాబు విసిగించేవారని కార్యకర్తలు విసిగిపోయేవారట. అయితే ఇప్పుడు చంద్రబాబు సమీక్షలు జరుపుతున్న తీరు చూసిన నేతలు, కార్యకర్తలు మాత్రం కొత్త విషయం చెబుతున్నారు.

చంద్రబాబు మారారు. గంటలు గంటలు మాట్లాడటం లేదు. కేవలం ఐదు నుంచి 10 నిమిషాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఏదైనా విషయం సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నారు. దీంతో మీటింగ్ అంటే భయపడే పరిస్థితి పోయిందని కార్యకర్తలు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు మారారని కార్యకర్తలు స్టాంప్‌ వేశారు. ఇక నేతలు ఏం చెబుతారో చూడాలి.