Breaking News
  • సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు: ఇద్దరు నిందితులు సాయి కృష్ణ, దేవరాజ్ లను కస్టడిలోకి తీసుకున్న పోలీసులు. సీన్ రీకన్ స్ర్టక్షన్ చేయనున్న ఎస్సార్ నగర్ పోలీసులు . శ్రావణి ఆత్మహత్య కు ముందు జరిగిన గొడవలపై కొనసాగనున్న విచారణ . ఆత్మహత్య కు ముందు ముగ్గురి మధ్య ఎం జరిగిందో తేల్చనున్న పోలీసులు . ప్రేమ పేరుతో శ్రావణిని మోసం చేసిన సాయి, దేవ్ రాజ్.
  • భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. 59 లక్షల 03 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 85,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. .గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 1089 మంది మృతి . గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 93,420 .దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 59,03,933 .దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 9,60,969 .“కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 48,49,584 .“కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 93,379 . దేశంలో 82.14 శాతం కరోనా రోగుల రికవరీ రేటు . దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 16.28 శాతం . దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.58 శాతానికి తగ్గిన మరణాల రేటు . దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 13,41,535 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు . దేశంలో ఇప్పటి వరకు 7,02,69,975 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు.
  • హేమంత్ కేస్ అప్డేట్ : కాంటినెంటల్ హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్న హేమంత్ డెడ్ బాడీ . అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు. యూకే నుండి అతని సోదరుడు వచ్చిన తర్వాతే అంత్యక్రియలు. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకోనున్న హేమంత్ సోదరుడు. హేమంత్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు. హేమంత్ ను చివరి చూపు చూసుకునేందుకు ఇంటికి చేరుకుంటున్న బంధువులు స్నేహితులు.
  • కూకట్ పల్లి, మియపూర్, చందనగర్ లో భారీ వర్షం. నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. రోడ్లపై వర్షం నీరు నిల్వ ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు.
  • తెలంగాణ కరోనా కేసుల అప్డేట్స్: తెలంగాణలో ఒకరోజు టెస్ట్ లో సంఖ్య 58925. తెలంగాణ లో కరోనా టెస్టింగ్స్ :2800761. రాష్ట్రంలో ఈరోజు పాజిటివ్ కేసులు : 2239. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు : 183866. జిహెచ్ఎంసి లో కరోనా కేసులు సంఖ్య : 316. జిహెచ్ఎంసి లో మొత్తం కరోనా కేసులు సంఖ్య : 58821. కరోనా తో ఈరోజు మరణాలు : 11. ఇప్పటి వరకూ మరణాలు మొత్తం : 1091. చికిత్స పొందుతున్న కేసులు : 30334. ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయిన వారు: 2281. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య: 152441.
  • చెన్నై : 10.30 గంటలకు ఎస్.పి బాలు అంత్యక్రియలు. తిరువల్లూరు జిల్లా తామరై పాక్కం ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు. బాలు చివరి కోరిక మేరకు ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు. ఫామ్ హౌస్ వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానులు. ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు. ఎపి ప్రభుత్వం తరపున బాలు అంత్యక్రియల్లో పాల్గొననున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్. బాలు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన రాజకీయ, సినీ ప్రముఖులు.
  • ఈ దుఃఖానికి హ‌ద్దే లేదు: ఇళ‌య‌రాజా. గాన‌గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం మ‌ర‌ణంపై ఆయ‌న ప్రియ స్నేహితుడు, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా స్పందించారు. ఆయ‌న ఓ వీడియో ద్వారా త‌న దుఃఖాన్ని వెలిబుచ్చారు. ``త్వ‌ర‌గా లేచిరా ..నిన్ను చూడ‌టానికి నేను వేచి ఉన్నానని చెప్పాను. కానీ నువ్వు వినిపించుకోలేదు. వెళ్లిపోయావు. ఎక్క‌డికి వెళ్లావు. గంధ‌ర్వ‌లోకంలో పాడ‌టానికి వెళ్లావా.. ఇక్క‌డ ప్ర‌పంచ శూన్యంగా మారిపోయింది. ప్ర‌పంచంలో నాకేమీ తెలియ‌డం లేదు. మాట్లాడ‌టానికి మాట‌లు రావ‌డం లేదు. చెప్ప‌డానికి ఏమీ లేదు. ఏం చెప్పాలో తెలియ‌డం లేదు. దుఃఖానికి ఓ హ‌ద్దు ఉంటుంది. కానీ నీవ‌ల్ల క‌లిగిన దుఃఖానికి హ‌ద్దే లేదు`` అన్నారు ఇళ‌యరాజా.

లీడర్లపై నమోదయ్యే కేసులపై ఇక సత్వర విచారణ!

ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల సత్వర విచారణకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ప్రతినిధులపై నమోదయ్యే కేసులను వేగంగా విచారించేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్‌కు కేంద్రం సానుకూలంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా...

Central government on cases against public representatives, లీడర్లపై నమోదయ్యే కేసులపై ఇక సత్వర విచారణ!

ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల సత్వర విచారణకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ప్రతినిధులపై నమోదయ్యే కేసులను వేగంగా విచారించేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్‌కు కేంద్రం సానుకూలంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనానికి నివేదించారు. ఈ రకమైన కేసుల సత్వర విచారణ కోసం కాలవ్యవధిని నిర్ణయించవచ్చని, ఈ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకునే ఏ నిర్ణయానికైనా కేంద్రం సానుకూలంగా ఉందని తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.

ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఐదేళ్ల తర్వాత అంటే 2020 నాటికి కూడా అమలు కాకపోవడంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ విచారణలో భాగంగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సెప్టెంబర్ తొలివారంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులపై నమోదయ్యే నేరారోపణ కేసులపై ఫాస్ట్ ట్రాక్ ట్రయల్‌కు సుముఖత వ్యక్తం చేసింది.

ఈ తరహా కేసుల విచారణకు సుప్రీంకోర్టు కాలవ్యవధిని నిర్దేశించవచ్చని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి నివేదించారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలయ్యే కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు త్వరలోనే కీలక తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.

Related Tags