కరోనా చికిత్సకు సీసీఎంబీ ప్రయత్నాలు.. పరీక్షల్లో 12 ఔషధాలు

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఓవైపు కరోనాను ఎదుర్కొనేందుకు టీకా తయారీ ప్రయత్నాలు జోరుగా సాగుతుండగా, మరోవైపు ఇప్పటికే వ్యాధి బారినపడ్డ వారికి

కరోనా చికిత్సకు సీసీఎంబీ ప్రయత్నాలు.. పరీక్షల్లో 12 ఔషధాలు
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 3:41 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఓవైపు కరోనాను ఎదుర్కొనేందుకు టీకా తయారీ ప్రయత్నాలు జోరుగా సాగుతుండగా, మరోవైపు ఇప్పటికే వ్యాధి బారినపడ్డ వారికి చికిత్స అందించే దిశగా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు వైరల్‌ వ్యాధుల చికిత్స కోసం ఉపయోగిస్తున్న మందులు కోవిడ్‌కూ పనికొస్తాయేమోనని పరిశీలిస్తోంది. వీటిల్లో స్మాల్‌పాక్స్‌ కోసం వాడే మందులతోపాటు మరో 11 మందులు ఉన్నట్లు తెలిసింది.

మరోవైపు.. ఉబ్బసం రోగులకు ఇచ్చే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్, స్మాల్‌పాక్స్‌ మెడిసిన్ కరోనాను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతున్నట్లు ప్రాథమిక అంచనాల ద్వారా తెలిసింది. ఎంపిక చేసిన మందులు కరోనా రోగుల్లో ఎంతవరకు సురక్షితమనే విషయంలో ఇప్పటికే తొలి రెండు దశల ప్రయోగాలు పూర్తి కాగా, మూడో దశ ప్రయోగాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మందులు జంతువులతోపాటు మనుషులపై కూడా ఎలాంటి దుష్ప్రభావాలు చూపలేదని సీసీఎంబీ డైరెక్టర్‌ తెలిపారు.

Read More:

కరోనా ప్రభావం తగ్గగానే రచ్చబండ.. గ్రామాల్లో పర్యటన

కరోనా ఎఫెక్ట్: శ్రావణమాసం పెళ్లిళ్లు.. అన్నీ ‘పరిమితమే’!