మెరుగుపడుతున్న బోరిస్ జాన్సన్ ఆరోగ్యం… భాగస్వామితో మాటామంతీ

కరోనా వ్యాధికి గురైన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. లండన్ లోని  సెయింట్ థామస్ ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్న ఆయన తన భాగస్వామి కేరీ సైమండ్స్ తో కొద్దిసేపు మాట్లాడగలిగారని డాక్టర్లు తెలిపారు.

మెరుగుపడుతున్న బోరిస్ జాన్సన్ ఆరోగ్యం... భాగస్వామితో మాటామంతీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 09, 2020 | 12:44 PM

కరోనా వ్యాధికి గురైన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. లండన్ లోని  సెయింట్ థామస్ ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్న ఆయన తన భాగస్వామి కేరీ సైమండ్స్ తో కొద్దిసేపు మాట్లాడగలిగారని డాక్టర్లు తెలిపారు. నర్సులతో సైతం ఆయన ఆప్యాయంగా మాట్లాడగలిగారట. గర్భిణి అయిన కేరీ సైమండ్స్ కి కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినప్పటికీ ఆమె కోలుకోగలిగారు. మరికొన్ని వారాల్లో జాన్సన్, కేరీ తలిదండులు కాబోతున్నారు. కాగా… జాన్సన్ బెడ్ పై కూర్చోగలుగుతున్నారని, ఆయనకు అద్భుతమైన చికిత్స లభిస్తోందని భారత సంతతికి చెందిన మంత్రి రిషి సునక్ తెలిపారు. తమ నేత ఆరోగ్యం మెరుగు పడుతోందని తెలియగానే లక్షలాది ప్రజలు సంతోషంతో చప్పట్లు కొట్టారు. అటు- జాన్సన్ త్వరగా కోలుకున్నప్పటికీ.. ఆయన పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోవడానికి కొన్ని నెలలు పట్టవచ్చునని ప్రముఖ డాక్టర్ ఒకరు తెలిపారు. ప్రస్తుతం జాన్సన్ కు తక్కువ మోతాదులో ఆక్సిజన్ ఇస్తున్నారు. వెంటిలేటర్ అవసరం లేదని వైద్యులు తేల్చారు.