WAPCOS Recruitment 2022: డిప్లొమా అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఫీల్డ్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా..

|

Nov 03, 2022 | 5:13 PM

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ (వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

WAPCOS Recruitment 2022: డిప్లొమా అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఫీల్డ్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా..
WAPCOS Limited Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ (వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌).. ఒప్పంద ప్రాతిపదికన 150 ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. సప్టెంబర్‌ 30, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా కింది ఈ మెయిల్ ఐడీకి నవంబర్‌ 15, 2022వ తేదీలోగా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్‌ చేసుకోవచ్చు.

ఈమెయిల్‌ ఐడీ: wapcosrdss@gmail.com

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.