IT Jobs: బీటెక్‌ పూర్తి చేసిన వారికి గోల్డెన్‌ ఛాన్స్‌.. వర్చుసా ఐటీ కంపెనీలో ఉద్యోగాలు.. హైదరాబాద్‌లోనూ ఖాళీలు..

|

Aug 16, 2022 | 8:31 AM

IT Jobs: వర్చుస్తా ఐటీ కంపెనీ పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అమెరికాకు చెందిన ఈ టెక్‌ కంపెనీ హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచెస్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు...

IT Jobs: బీటెక్‌ పూర్తి చేసిన వారికి గోల్డెన్‌ ఛాన్స్‌.. వర్చుసా ఐటీ కంపెనీలో ఉద్యోగాలు.. హైదరాబాద్‌లోనూ ఖాళీలు..
Follow us on

IT Jobs: వర్చుస్తా ఐటీ కంపెనీ పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అమెరికాకు చెందిన ఈ టెక్‌ కంపెనీ హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచెస్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలని కంపెనీ తెలిపింది. ఆఫ్ క్యాంపస్ విధానంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంతకీ ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

* న్యూరల్‌హ్యాక్‌ విభాగంలో అసోసియేట్‌ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పోస్టుల ఆధారంగా 10వ తరగతి నుంచి బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ/ ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న వారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 5 లక్షల నుంచి రూ. 6.5 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.

* ఎంపికైన వారిని అసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌/ బెంగళూరు/ చెన్నై/ పుణె/ గురుగావ్‌/ దిల్లీ/ కోల్‌కతా/ ముంబయి బ్రాంచ్‌ల్లో నియమిస్తారు.

* అభ్యర్థులను రాత పరీక్ష, పలు స్టేజీల్లో ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 21-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..