UPSC Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర కార్మిక & ఉపాధి, హోం వ్యవహారాలు తదితర మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్(ఫిషింగ్ బయాలజీ) (01), డిప్యూటీ డైరెక్టర్(కంప్యూటర్ & సిస్టమ్ విభాగం) (01), సైంటిస్ట్ ‘బి’ (ఫోరెన్సిక్ డీఎన్‌ఏ) (06), జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఎక్స్‌ప్లోజివ్స్) (01), సైంటిస్ట్ ‘బి’ (కెమిస్ట్రీ) (01), సైంటిస్ట్ ‘బి’ (జియో-ఫిజిక్స్) (01), సైంటిస్ట్ ‘బి’ (జియాలజీ) (01), లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ (సెంట్రల్) (42 ) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 29-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..