UPSC Recruitment 2021: యూపీఎస్సీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. గడువు ఎప్పటి వరకు అంటే..

UPSC Recruitment 2021: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యుపీఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు..

UPSC Recruitment 2021: యూపీఎస్సీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. గడువు ఎప్పటి వరకు అంటే..
Upsc Recruitment 2021

Updated on: Mar 27, 2021 | 7:17 PM

UPSC Recruitment 2021: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యుపీఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు upc.gov.in లో యుపీఎస్సీ అధికారిక సైట్ ద్వారా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2021 ఏప్రిల్ 15 వరకు ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలో 28 పోస్టులను భర్తీ చేస్తుంది. అభ్యర్థులు అర్హత, దరఖాస్తు ఫీజు మరియు ఇతర వివరాలను వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఖాళీ వివరాలు:

– అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్స్): 14 పోస్టులు
– అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజియాలజీ): 2 పోస్టులు
– అసిస్టెంట్ ప్రొఫెసర్ (సైకియాట్రీ): 11పోస్టులు
– అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ): 1 పోస్ట్

దరఖాస్తు ఫీజు:

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఫీజు చెల్లించేందుకు ఎస్బీఐ, లేదా ఏదైనా శాఖ ద్వారాగానీ, నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ఉపయోగించి దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ అయింది.ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఐదు పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు:

లేడీ మెడికల్ ఆఫీసర్ (ఫ్యామిలీ వెల్ఫేర్)-2,
ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) -1,
షిప్ సర్వేయర్ కమ్-డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (టెక్నికల్) – 1,
చీఫ్ ఆర్కిటెక్ట్ కార్యాలయంలో పని చేసేందుకు అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ – 1.

అర్హతలు :

లేడీ మెడికల్ ఆఫీసర్ (ఫ్యామిలీ వెల్ఫేర్): నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీని నుంచి వైద్య విద్య పూర్తి చేసి ఉండాలి. అలాగే ఇంటర్న్‌షిప్ కలిగి ఉండాలి.

ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్): ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి. దాంతోపాటు.. అభ్యర్థులకు ఓడల రూపకల్పన /ఇన్‌స్టాలేషన్/ నౌకల నిర్మాణంలో పదేళ్ల అనుభవం ఉండాలి.

షిప్ సర్వేయర్ కమ్-డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (టెక్నికల్):
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి నావెల్ ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ కలిగి ఉండాలి. డిగ్రీ కోర్సు అనంతంర షిప్ నిర్మాణం/షిప్ రిపేరింగ్ యార్డు/ షిప్ డిజైన్/ కమ్యూనికేషన్‌లో ఎనిమిది సంవత్సరాల ఆచరణాత్మక అనుభవం ఉండాలి.

అసిస్టెంట్ ఆర్కిటెక్ట్:

ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / ఇన్‌స్టిట్యూషన్ నుంచి సమానమైన డిప్లోమా అర్హత కలిగి ఉండాలి. లేదా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేత గుర్తించబడి ఉండాలి. లేదా.. రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్ వద్ద రెండేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. అయితే ఏప్రిల్ 1వ తేదీ వరకు సంబంధిత పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసుకోవాల్సి ఉండగా, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 2 వరకు గడువు ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us