UPSC IES, ISS Examination 2022 Notification: భారత ప్రభుత్వానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. 2022 సంవత్సరానికిగానూ ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (UPSC IES and ISS 2022) ద్వారా ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పరీక్ష: ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022
మొత్తం ఖాళీలు: 53
వయోపరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: ఎకనామిక్స్/అప్లైడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ఎకనామెకట్రిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంబీబీఎస్ చివరి ఏడాది పరీక్షలు రాసిన విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2022.(సాయంత్రం 6 గంటలు)
దరఖాస్తు రుసుము:
పరీక్ష తేదీ: జూన్ 26, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: