
హైదరాబాద్, జూన్ 18: షెడ్యూల్ ప్రకారం జూన్ 22, 23, 24, 25, 29, 30 తేదీలలో రోజుకు రెండు షిఫ్టుల్లో యూజీసీ నెట్ ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. UGC NET 2026 అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదివి, పరీక్ష సమయంలో వాటిని పాటించాలని NTA అభ్యర్థులకు సూచించింది. అడ్మిట్ కార్డు లేకుండా ఏ అభ్యర్థినీ పరీక్షా హాలులోకి అనుమతించరని తెలిపింది. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఉపయోగపడే ఈ పరీక్షను మొత్తం 87 సబ్జెక్టులకు నిర్వహిస్తారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు. సీబీటీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. అబ్జెక్టివ్ తరహాలోనే ఉంటుంది. మొత్తం 3 గంటల వ్యవధిలో ఒకేసారి రెండు పేపర్లకు పరీక్ష రాయవల్సి ఉంటుంది.
యూజీసీ నెట్ జూన్ 2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NTA వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న UGC NET 2026 అడ్మిట్ కార్డ్ యొక్క ప్రింటెడ్ కాపీ, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు (దరఖాస్తు ఫారంలో అప్‌లోడ్ చేసినవి మాత్రమే), ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఫోటో గుర్తింపు పత్రం, PwD/PwBD కేటగిరీ కింద సడలింపును క్లెయిమ్ చేస్తున్నట్లయితే PwD/PwBD సర్టిఫికేట్ తమతోపాటు తప్పనిసరిగా తీసుకురావాలి. అభ్యర్థులు తమకు కేటాయించిన కంప్యూటర్‌లో ఉన్న ప్రశ్నపత్రం తాము ఎంచుకున్న సబ్జెక్టుకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే ఇన్విజిలేటర్లకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా తెలియజేయాలి.
యూజీసీ నెట్ జూన్ 2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.