UGC NET 2022 Results: యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

|

Feb 21, 2022 | 3:31 PM

యూజీసీ నెట్‌ 2021 ఫలితాలను శనివారం (ఫిబ్రవరి 19) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను..

UGC NET 2022 Results: యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
Ugc Net Results
Follow us on

UGC NET 2021-22 Results: యూజీసీ నెట్‌ 2021 ఫలితాలను శనివారం (ఫిబ్రవరి 19) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను యూజీసీ అధికారిక సైట్ ugcnet.nta.nic.in లేదా ఎన్టీఏ వెబ్‌సైట్‌nta.ac.inలలో తనిఖీ చేసుకోవచ్చు. కోవిడ్‌ 19 మహమ్మారి కారణంగా డిసెంబర్, జూన్ సెషన్‌లకు సంబంధించిన ఫలితాల విడుదల ఆలస్యమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం ఎదురుచూపు తర్వాత ఎట్టకేలకు ఫలితాలు వెలువడ్డాయి. కాగా మొత్తం 3 దశల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఫేజ్ I గత ఏడాది నవంబర్ 20 నుంచి డిసెంబర్ 5 మధ్య జరిగాయి. ఫేజ్ II డిసెంబర్ 24 నుంచి 27 వరకు, ఇక ఫేజ్ III ఈ ఏడాది జనవరి 4, 5, తేదీల్లో జరిగాయి. దేశవ్యాప్తంగా 239 సిటీల్లోని 837 కేంద్రాల్లో 81 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది దాదాపు 12 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఫలితాలు తాజాగా వెలువడ్డాయి.

UGC NET 2021-22 ఫలితాలు ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా యూజీసీ అధికారిక వెబ్‌సైట్ugcnet.nta.nic.in.ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజీలో ‘Download UGC NET December 2020, June 2021 scores’ అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్/లేదా పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్‌ అవ్వాలి.
  • వెంటనే అభ్యర్ధులకు సంబంధించిన ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • రిజల్ట్‌ పేజ్‌ను సేవ్‌ చేసుకుని, డౌన్‌లోడ్ చేసి ప్రింట్ఔట్‌ తీసుకోవాలి.

కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్కులు ఇలా..
యూజీసీ నెట్‌ 2021 పరీక్షలో అభ్యర్ధులకు ఉత్తీర్ణత మార్కులు ఈ విధంగా ఉండాలి. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 35 శాతం స్కోర్ చేయాల్సి ఉంటుంది. నెట్‌ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ ఫలితాలకు సంబంధించి పునఃమూల్యాంకనం/ పునఃపరిశీలన (re-evaluation/re-checking)కు అనుమతి ఉండదని యూజీసీ ఈ సందర్భంగా తెలియజేసింది.

Also Read:

NEET UG Counselling 2021: ఆల్‌ ఇండియా కోటా రౌండ్‌ 2 కౌన్సెలింగ్‌కు నేడే ఆఖరు.. మరికొన్ని గంటల్లోనే..