
హైదరాబాద్, ఏప్రిల్ 3: తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తు గడువు రేపటితో (ఏప్రిల్ 4) ముగియనుంది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు తక్షణమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా రేపు రాత్రి 11.59 గంటలలోపు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈఏపీసెట్ 2026లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ వృత్తి విద్యా కాలేజీల్లో ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ విభాగాల్లోని సీట్లను ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 4లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ ఈఏపీసెట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ ఈఏపీసెట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.