
హైదరాబాద్, మే 19: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పాలీసెట్) 2026 అడ్మిషన్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యా శాఖ సోమవారం విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం తొలి దశ కౌన్సెలింగ్ మే 27న ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ మే 21 నుంచి 31 వరకు జరుగుతుంది. ఆ తర్వాత మే 29 నుంచి జూన్ 1 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెబ్ ఆప్షన్లు మే 29 నుంచి జూన్ 3 వరకు అందుబాటులో ఉంటాయి. తాత్కాలిక సీట్ల కేటాయింపు జూన్ 6న లేదా అంతకంటే ముందే ఉండే అవకాశం ఉంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 6 నుంచి 9 మధ్య వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, స్వీయ-రిపోర్ట్ చేసుకోవల్సి ఉంటుంది.
టీజీ పాలీసెట్ 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అభ్యర్థులు జూన్ 8, 9 తేదీలో తమకు కేటాయించిన కాలేజీల్లో హాజరు కావాలి. ఇక 2026-27 విద్యా సంవత్సరం జూన్ 9న ప్రారంభమవుతుంది. అంటే జూన్ 9వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. జూన్ 9, 10 తేదీలలో ఓరియెంటేషన్ జరగనుంది. పాలీసెట్ తుది దశ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ జూన్ 15న, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 16న జరుగుతుంది. వెబ్ ఆప్షన్లను జూన్ 16, 17 తేదీలలో నమోదు చేసుకోవాలి. తాత్కాలిక సీట్ల కేటాయింపు జూన్ 20న లేదా అంతకంటే ముందు జరుగుతుంది. ఫీజు చెల్లింపులు, ఆన్‌లైన్‌లో స్వీయ-రిపోర్టింగ్ జూన్ 20 నుంచి 22 మధ్య పూర్తి చేయాలి. విద్యార్థులు జూన్ 22, 23 తేదీల్లో తమకు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
కేంద్రీకృత అంతర్గత స్లైడింగ్ (ఒకే కళాశాలలో కానీ వేరే బ్రాంచ్‌కు) కోసం వెబ్ ఆప్షన్లను జూన్ 27, 28 తేదీలలో అందుబాటులో ఉంటాయి. కేంద్రీకృత అంతర్గత స్లైడింగ్ ద్వారా ఎంపికైన అర్హులైన అభ్యర్థులకు ఫీజు వాపసు ఇస్తారు. జూన్ 30న లేదా అంతకంటే ముందు సీట్లు కేటాయింపు ఉంటుంది. అభ్యర్థులు జూలై 1న అదే కాలేజీలోని కొత్త బ్రాంచ్‌లో చేరవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో స్పాట్ అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలను జూలై 1న అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు. జూలై 8తో స్పాట్ అడ్మిషన్లు పూర్తి అవుతాయి.
టీజీ పాలీసెట్ 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.