TG Lawcet 2026 Results: తెలంగాణ లా సెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ లా కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్ ఫలితాలు గురువారం (జూన్ 4) సాయత్రం 4 గంటలకు విడుదలయ్యాయి. ఫలితాలను ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

TG Lawcet 2026 Results: తెలంగాణ లా సెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
TG Lawcet Results

Updated on: Jun 04, 2026 | 4:48 PM

హైదరాబాద్‌, జూన్ 4: తెలంగాణ లాసెట్ (TG Law cet 2026), పీజీఎల్‌సెట్‌ (TG PGLCET 2026) ప్రవేశ పరీక్షల ఫలితాలు గురువారం (జూన్‌ 4) విడుదలయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను, స్కోర్ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ లాసెట్ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ లా సెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ లా కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాదిమే 18న టీజీ లాసెట్, పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీజీఎల్‌సెట్‌) ప్రవేశ పరీక్షలను హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగాయి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ లాసెట్ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us