TET 2026 Notification: మరో 2 రోజుల్లోనే టెట్ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ పరీక్షలు ఎప్పుడంటే?

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాది రెండుసార్లు టెట్ జరపాల్సి ఉండగా.. ఈ ఏడాదికి తొలి విడత నోటిఫికేషన్‌ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. టెట్ నోటిఫికేషన్‌ విడుదలకు ఇటీవల పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి

TET 2026 Notification: మరో 2 రోజుల్లోనే టెట్ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ పరీక్షలు ఎప్పుడంటే?
Telangana Teacher Eligibility Test

Updated on: Apr 12, 2026 | 3:20 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: తెలంగాణలో 2026 సంవత్సరానికి సంబంధించి మెుదటి విడత టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాది రెండుసార్లు టెట్ జరపాల్సి ఉండగా.. ఈ ఏడాదికి తొలి విడత నోటిఫికేషన్‌ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. టెట్ నోటిఫికేషన్‌ విడుదలకు ఇటీవల పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. టెట్ నోటిఫికేషన్ 2026 వెలువడిన తర్వాత జూన్ రెండో వారంలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. గత ఏడాదికి సంబంధించి తుది విడత టెట్‌ పరీక్షలను జనవరి 2026లో నిర్వహించారు. ఈ రెండో విడత పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.95 లక్షల మంది హాజరయ్యారు.

తెలంగాణ టెట్‌ 2026 నోటిఫికేషన్‌ వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

బీఎడ్‌, డీఎడ్‌ అభ్యర్దులతోపాటు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ టీచర్లు కూడా తప్పనిసరిగా టెట్‌లో ఉత్తీర్ణత పొందాల్సిందేనని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెట్ నుంచి మినహాయింపు ఇస్తారని భావించి చాలా మంది దరఖాస్తు చేయలేదు. దీంతో 2011కి ముందు విధుల్లో చేరిన ఉపాధ్యాయులంతా టెట్‌లో ఉత్తీర్ణత పొందవల్సి ఉంది. కాగా రేవంత్‌ సర్కార్‌ యేటా రెండు సార్లు టెట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో మొదటి టెట్ (ఏప్రిల్) నోటిఫికేషన్ సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది. గతడాది చివర్లో విడుదలైన నోటిఫికేషన్ కు కూడా చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు. గత టెట్ పరీక్షల్లో ఇన్ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులలో 37,893 మంది అర్హత సాధించారు. ఇక ఏప్రిల్ సెషన్‌కు నోటిఫికేషన్‌ వచ్చాక జూన్‌లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే వేసవి సెలవుల్లో టెట్‌ పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా డీఎస్సీ పరీక్ష రాసేందుకు టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించవల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా డీఎస్సీ రాయవచ్చు. అలాగే టెట్‌లో ఎక్కువ స్కోర్ తెచ్చుకునేంందుకు ఎన్నిసార్లు అయినా టెట్‌ పరీక్ష రాయవచ్చు. ఎలాంటి పరిమితి లేదు. అయితే కనీస అర్హత మార్కులు ఓసీ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు 40 శాతం చొప్పున సాధించాల్సి ఉంటుంది.

తెలంగాణ టెట్‌ 2026 నోటిఫికేషన్‌ వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us