తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు 2023-24 దరఖాస్తులు ఆహ్వానం..

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు..

తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు 2023-24 దరఖాస్తులు ఆహ్వానం..
TSWREIS Sainik School Admissions

Updated on: Jan 31, 2023 | 8:11 PM

కరీంనగర్‌ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సైనిక పాఠశాలలో బాలురకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 80 సీట్ల భర్తీకి అర్హులైన బాలుర నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత లేదా ప్రస్తుతం చదువుతున్న బాలురు దరఖాస్తు చేసకోవచ్చు. తెలుగు/ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్న విద్యార్థులు అర్హులు. అలాగే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలోనైతే రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.లక్షన్నరకు మించకూడదు. విద్యార్ధుల వయసు ఏప్రిల్‌ 1, 2023 నాటికి 11 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ రూ.200లు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జనవరి 31, 2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2023.
  • హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ తేదీ: ఫిబ్రవరి 17, 2023 నుంచి..
  • ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 26, 2023.
  • రాత పరీక్ష ఫలితాల విడుదల తేదీ: మార్చి 8, 2023.
  • ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తేదీలు: 2023, మార్చి 20, 22, 24, 25, 26
  • ఫలితాల ప్రకటన తేదీ: మార్చి 28, 2023.
  • ప్రవేశాల ప్రారంభ తేదీ: మార్చి 30, 2023.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us