తెలంగాణ SI అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ లింక్ ఇదే!

తెలంగాణలో సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ 22 నుంచి అభ్యర్థులు TGPRB అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి నవంబర్ 28 అర్ధరాత్రి 12 గంటలే చివరి గడువు..

తెలంగాణ SI అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ లింక్ ఇదే!
Telangana Police SI Hall Tickets

Updated on: Nov 23, 2026 | 6:14 AM

హైదరాబాద్‌, నవంబర్ 23: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్‌టికెట్లను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TGPRB) విడుదల చేసింది. నవంబర్ 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని TGPRB ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థులు నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా హాల్‌టికెట్లను పొందాలని సూచించారు.

ఈ నెల 29వ తేదీ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా SI ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, అందులో పేర్కొన్న పరీక్ష కేంద్రం, ఇతర వివరాలను పరిశీలించుకోవాలి.

హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

  • ముందుగా తెలంగాణ పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in ను సందర్శించాలి.
  • SI ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేయాలి.
  • లాగిన్ అయిన తర్వాత హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • హాల్‌టికెట్‌లోని వివరాలను సరిచూసుకుని ప్రింట్ తీసుకోవాలి.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌ను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్ష తేదీ, సమయం, కేంద్రం వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఎస్‌ఐ ఉద్యోగాలకు హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us