TS lawcet 2022 Results: రేపు విడుదలకానున్న తెలంగాణ లా సెట్ 2022 ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

|

Aug 16, 2022 | 7:02 PM

తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET) 2022, పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGLCET) 2022 ఫలితాలు రేపు (ఆగస్టు 17) విడుదలకానున్నాయి..

TS lawcet 2022 Results: రేపు విడుదలకానున్న తెలంగాణ లా సెట్ 2022 ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
Ts Lawcet 2022
Follow us on

TS lawcet 2022 Result Date: తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS LAWCET) 2022, పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGLCET) 2022 ఫలితాలు రేపు (ఆగస్టు 17) విడుదలకానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిముషాలకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వి. వెంకట రమణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్, ఆర్‌. లింబాద్రి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌ లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది జరిగిన లాసెట్‌, పీజీలాసెట్‌ పరీక్షలకు మొత్తం 35,538 మంది విద్యార్థులు రిజిస్టరేషన్‌ చేసుకున్నారు. వీరిలో 28,921 మంది జూలై 21, 22 తేదీల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ప్రవేశ పరీక్షల్లో సాధించిన ర్యాంకు ఆధారంగా మూడేళ్ల, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.