TS ICET 2023 Admit Card: తెలంగాణ ఐసెట్-2023 హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఏయే తేదీల్లోనంటే..

తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 (టీఎస్‌ ఐసెట్‌) హాల్‌టికెట్లు సోమవారం విడుదలయ్యాయి. ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వివరాలు నమోదు చేసి..

TS ICET 2023 Admit Card: తెలంగాణ ఐసెట్-2023 హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఏయే తేదీల్లోనంటే..
TS ICET 2023

Updated on: May 23, 2023 | 12:24 PM

తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 (టీఎస్‌ ఐసెట్‌) హాల్‌టికెట్లు సోమవారం విడుదలయ్యాయి. ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవల్సిందిగా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

మే 26, 27 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరగనుంది. రోజుకు రెండు షిఫ్టుల ప్రకారం ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. 2023-24 విద్యాసంవత్సరానికి వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఐసెట్‌ పరీక్షను నిర్వహిస్తోంది. ఐసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us