TG High Court Jobs 2026: 7వ తరగతి, ఇంటర్ అర్హతతో.. సొంత జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్, టైపిస్ట్‌ ఉద్యోగాలు! లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర హైకోర్టు (TGHC) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 859 స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3, జూనియర్ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ఎగ్జామినర్‌, ఎగ్జామినర్‌, కాపిస్ట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులను భర్తీ..

TG High Court Jobs 2026: 7వ తరగతి, ఇంటర్ అర్హతతో.. సొంత జిల్లా కోర్టుల్లో కాపీయిస్ట్, టైపిస్ట్‌ ఉద్యోగాలు! లింక్‌ ఇదే
Telangana High Court Jobs

Updated on: Feb 01, 2026 | 3:59 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర హైకోర్టు (TGHC) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 859 స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3, జూనియర్ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ఎగ్జామినర్‌, ఎగ్జామినర్‌, కాపిస్ట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 13, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు, ఎంపిక విధానం తదితర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

పోస్టుల వివరాలు ఇవే..

  • స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 పోస్టుల సంఖ్య: 35
  • జూనియర్ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 159
  • టైపిస్ట్‌ పోస్టుల సంఖ్య: 42
  • ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 61
  • ఎగ్జామినర్‌ పోస్టుల సంఖ్య: 49
  • కాపిస్ట్‌ పోస్టుల సంఖ్య: 63
  • రికార్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 36
  • ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టుల సంఖ్య: 95
  • ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల సంఖ్య: 319

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత పోస్టును అనుసరించి 7వ తరగతి, ఇంటర్‌, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పోస్టులకు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 13, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.400 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు రూ.32,810 నుంచి రూ.96,890 వరకు, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.24,280 నుంచి రూ.72,850 వరకు, ఎగ్జామినర్‌, కాపిస్ట్‌, ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టులకు రూ.22,900 నుంచి రూ.69,150 వరకు, రికార్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ. 22,240 నుంచి రూ.67,300 వరకు, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు రూ.19,000 నుంచి రూ.58,850 వరకు జీతంగా చెల్లిస్తారు.

తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల దరఖాస్తుకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.