SBI PO Recruitment: ఎస్‌బీఐ పీవో పోస్టులకు అప్లై చేసుకున్నారా.. దరఖాస్తులకు చివరి తేదీ దగ్గర పడుతోంది..

SBI PO Recruitment 2021: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారీ స్థాయిలో ప్రొబేషనరీ పోస్టులను భర్తీ చేయనున్నారు...

SBI PO Recruitment: ఎస్‌బీఐ పీవో పోస్టులకు అప్లై చేసుకున్నారా.. దరఖాస్తులకు చివరి తేదీ దగ్గర పడుతోంది..
Sbi Jobs

Updated on: Oct 21, 2021 | 8:57 AM

SBI PO Recruitment 2021: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారీ స్థాయిలో ప్రొబేషనరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఈ నెల 25తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 2056 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో 2000రెగ్యులర్‌ పోస్టులు, 56 బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

* చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

* అభ్యర్థుల వయసు 01.04.2021 నాటికి 21–30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మూడంచెల విధానంలో ఎంపిక చేస్తారు. మొదట ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, చివరిగా ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 05-10-2021న ప్రారంభంకాగా.. 25.10.2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్షను నవంబర్‌/డిసెంబర్‌ 2021లో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Illegal liquor: ఓరి గడుగ్గాయ్.. బైక్‌లో ఇన్ని లిక్కర్ బాటిల్సా.. కౌంట్ చేసి కంగుతిన్న పోలీసులు

భక్తులను మెస్మరైజ్‌ చేస్తున్న కోతి.! సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌.. వీడియో

భక్తులను మెస్మరైజ్‌ చేస్తున్న కోతి.! సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌.. వీడియో

 

Loading...
Unable to load recommendations.
Follow Us