SSC Govt Jobs 2026: ఎస్‌ఎస్‌సీ 731 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ పాసైతే చాలు లక్షల్లో జీతం

ఇంటర్ పాసైన వారికి కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాలకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’, గ్రేడ్‌ ‘డి’ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన వారు ఆన్ లైన్ విధానంలో..

SSC Govt Jobs 2026: ఎస్‌ఎస్‌సీ 731 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ పాసైతే చాలు లక్షల్లో జీతం
SSC Stenographer Examination Notification

Updated on: Apr 26, 2026 | 6:20 AM

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ శాఖలు, కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’, గ్రేడ్‌ ‘డి’ ఉద్యోగాల భర్తీకి 2026 సంవత్సరానికిగానూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం మొత్తం 731 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చక్‌ చేసుకోండి.

ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’, గ్రేడ్‌ ‘డి’ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ డి (గ్రూప్‌ సి) ఎగ్జామినేషన్‌ 2026కి దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ఆగస్ట్‌ 1, 2026 నాటికి ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు అభ్యర్థులకు తప్పనిసరిగా స్టెనోగ్రఫీ (Stenography)లో నైపుణ్యం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ పోస్టులకు18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఆగస్ట్‌ 2, 1996 నుంచి ఆగస్ట్‌ 1, 2008 మధ్య జన్మించి ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి’ 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అంటే ఆగస్ట్‌ 2, 1999 నుంచి ఆగస్ట్‌ 1, 2008 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 15, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు మాత్రం ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి హిందీ లేదా ఇంగ్లిష్‌లో స్టెనోగ్రఫీ స్కిల్‌ టెస్ట్‌ ఉంటుంది. గ్రేడ్ సీకి నిమిషానికి 100 పదాలు, గ్రేడ్ డీకి 80 పదాల వేగం ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’, గ్రేడ్‌ ‘డి’ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రాత పరీక్ష విధానం

జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్‌ నుంచి 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 50 మార్కులు, కాంప్రహెన్షన్ నుంచి 50 మార్కులు చొప్పున మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులకు ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 15, 2026.
  • ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: మే 16, 2026.
  • దరఖాస్తు సవరణ తేదీలు: మే 20, 2026 నుంచి మే 21, 2026 వరకు
  • ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీలు: జులై నుంచి ఆగస్టు 2026 మధ్యలో

ఎస్సెస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’, గ్రేడ్‌ ‘డి’ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us