Good News: టెన్త్‌ అర్హతతో.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 3603 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల!

|

Mar 23, 2022 | 3:31 PM

భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌, పెన్షన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC).. మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌, హవల్దార్‌ (Multi-Tasking Staff and Havaldar Posts) పోస్టుల భర్తీకి..

Good News: టెన్త్‌ అర్హతతో.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 3603 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల!
Ssc Mts Recruitment 2022
Follow us on

SSC MTS Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌, పెన్షన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC).. మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌, హవల్దార్‌ (Multi-Tasking Staff and Havaldar Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3603 (మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌ ఖాళీల వివరాలు ఇంకా ప్రకటించలేదు)

పోస్టుల వివరాలు: మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌, హవల్దార్‌ (CBIC, CBN) పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.31,000ల నుంచి రూ.75,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.100
  • ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2022.
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరితేదీ: మే 2, 2022.
  • చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మే 3, 2022.
  • కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష (టైర్‌ 1) తేదీ: జులై, 2022.
  • రాత పరీక్ష (టైర్‌ 2) తేదీ ఇంకా ప్రకటించలేదు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

తెలంగాణ కొలువుల జాతర! వైద్యఆరోగ్యశాఖలోని 12,755 పోస్టుల భర్తీ ఇలానే..ఈ పోస్టులకు నో ఎగ్జాం!