SIDBI Recruitment: సిడ్బీలో స్పెషలిస్ట్ పోస్టులు. ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక‌.. రేపే చివ‌రి తేదీ..

|

Jan 27, 2022 | 6:36 AM

SIDBI Recruitment: స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SIDBI) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ల‌క్నో ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ‌లో ప‌లు విభాగాల్లో ఉన్న స్పెష‌లిస్ట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు శుక్ర‌వారంతో...

SIDBI Recruitment: సిడ్బీలో స్పెషలిస్ట్ పోస్టులు. ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక‌.. రేపే చివ‌రి తేదీ..
Follow us on

SIDBI Recruitment: స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SIDBI) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ల‌క్నో ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ‌లో ప‌లు విభాగాల్లో ఉన్న స్పెష‌లిస్ట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు శుక్ర‌వారంతో గ‌డువు ముగియ‌నున్న నేప‌థ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో లీగల్‌ కౌన్సిల్, చీఫ్‌ ఆఫీసర్, లీడ్‌ ఆఫీసర్, లీడ్‌స్పెషలిస్ట్, స్టాటిస్టీషియన్, డేటాసైంటిస్ట్, ప్రొక్యూర్‌మెంట్‌ ఆఫీసర్, బ్రాండింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్, రిస్క్‌ అనలిస్ట్, రిస్క్‌ ఆఫీసర్, కన్సల్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల ఆధారంగా గ్రాడ్యుయేషన్, లా డిగ్రీ, బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఎం/సీఏ/సీఎఫ్‌ఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాట ప‌నిలో అనుభవం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు పోస్టుల ఆధారంగా 30 నుంచి 45 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈమెయిల్‌ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థులు త‌మ పూర్తి వివ‌రాల‌ను recruitment@sidbi.in మెయిల్ ఐడీకి పంపించాలి.

* అభ్య‌ర్థుల‌ను తొలుత ప‌ని అనుభ‌వం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 28-01-2021తో ముగియనుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Beetroot: క్యాన్సర్‌ను తరమికొట్టే దివ్య ఔషదం.. తాజా పరిశోధనలలో సరికొత్త నిజాలు..

Richest Man of India: ధనవంతుల జాబితాలో అంబానీ డౌన్.. ఇక దేశంలో నంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ ఆయనే..!

Amalapuram: లిక్కర్ గోడౌన్‌లో పనిచేస్తోన్న యువతిపై డిపో మేనేజర్ లైంగిక వేధింపులు.. భరించలేక ఆమె ఏం చేసిందంటే