SIDBI Recruitment: స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. భారీగా వేతనం పొందే ఛాన్స్..

|

Nov 08, 2021 | 5:57 PM

SIDBI Recruitment: స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయిలో ఉన్న ఈ సంస్థలో ఐటీ స్పెషలిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా

SIDBI Recruitment: స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. భారీగా వేతనం పొందే ఛాన్స్..
Sidbi Recruitment
Follow us on

SIDBI Recruitment: స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయిలో ఉన్న ఈ సంస్థలో ఐటీ స్పెషలిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జే2ఈఈ జూనియర్‌ డెవలపర్, జే2ఈఈ సీనియర్‌ డెవలపర్, టెక్నికల్‌ లీడ్, జీ2ఈఈ టెక్నికల్‌ లీడ్, డెవొప్స్‌ లీడ్, టెక్నికల్‌ ఆర్కిటెక్ట్, టెక్నికల్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

* ఫుల్‌స్టాక్, జే2ఈఈ బ్యాక్‌ఎండ్, డెవొప్స్, మేనేజ్‌మెంట్‌ స్పేషలైజేషన్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ ఇంజనీరింగ్, ఎంసీఏ/తత్సమాన ఉత్తీర్ణత, ఐటీలో అనుభవంతోపాటు సంబంధిత స్కిల్స్‌ ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌/ ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు recruitment@sidbi.injకి దరఖాస్తు చేసుకోవాలి.

* ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులను చీఫ్‌ జనరల్‌ మేనేజర్, హ్యూమన్‌ రిసోర్సెస్‌ వర్టికల్‌ (హెచ్‌ఆర్‌వీ), స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, స్వాలంబన్‌ భవన్, ప్లాట్‌ నెం.సీ–11, ‘జీ’ బ్లాక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, బాంద్రా(ఈస్ట్‌), ముంబై–400051 చిరునామకు పంపించాలి.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా ఏడాదికి రూ. 8 నుంచి 40 లక్షల వరకు అందిస్తారు.

* అభ్యర్థులను ప్రిలిమినరీ స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధాంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 21-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Crime news: ఆ ఇంట్లో నాలుగు మృతదేహాలు.. హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడా.. అసలు ఏం జరిగింది..

Lakhimpur Kheri case: లఖీంపూర్‌ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్.. యూపీ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు!

AP Weather Report: దక్షిణ కోస్తాకు వాయుగుండం ఎఫెక్ట్.. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు