RRB NTPC 2026: ఎన్టీపీసీ (యూజీ) సీబీటీ 1 పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పు గమనించారా..? మూడు దశల్లో రాత పరీక్షలు

RRB NTPC 2026 Exam Dates: వివిధ రైల్వే రీజియన్లలో ఎన్‌టీపీసీ విభాగంలోని 3,058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇటీవల సీబీటీ 1 తేదీను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ రాత పరీక్షలు మూడు దశల్లో..

RRB NTPC 2026: ఎన్టీపీసీ (యూజీ) సీబీటీ 1 పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పు గమనించారా..? మూడు దశల్లో రాత పరీక్షలు
RRB NTPC UG Exam Dates

Updated on: Apr 16, 2026 | 5:12 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 16: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఎన్‌టీపీసీ విభాగంలోని 3,058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇటీవల సీబీటీ 1 తేదీను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ రాత పరీక్షలు మూడు దశల్లో జరగనున్నాయి. దేశం మొత్తం మీద లక్షల్లో దరఖాస్తులు రావడంతో ఆర్‌ఆర్‌బీ అధికారులు సీబీటీ 1 పరీక్షలకు ఈ మేరకు 3 దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు.

మొదటి దశ పరీక్షలు మే 7, 8, 9 తేదీల్లో జరుగుతాయి. రెండవ దశ పరీక్షలు జూన్ 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక మూడవ దశ పరీక్షలు జూన్ 16న ప్రారంభమై జూన్ 21 వరకు కొనసాగుతుంది. ఈ మేరకు మొదటి విడత CBT-1 పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను ఆర్‌ఆర్‌బీ వెల్లడించింది. మూడు దశల్లో జరిగే ఆన్‌లైన్‌ పరీక్షలు మే లో మొదలై జూన్ నెల వరకు కొనసాగనున్నాయి.

ఎన్టీపీసీ (యూజీ) సీబీటీ 1 పరీక్షల షెడ్యూల్‌ 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను అభ్యర్థులు తమ పరీక్ష తేదీలకు 10 రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ స్లిప్‌లలో తమకు కేటాయించిన పరీక్షా నగరం, పరీక్ష తేదీ వివరాలు మాత్రమే ఉంటాయి. ఇతర వివరాలు అడ్మిట్‌ కార్డులో మాత్రమే చెక్‌ చేసుకోవల్సి ఉంటుంది. అడ్మిట్‌ కార్డులను పరీక్ష తేదీకి 4 లేదా 3 రోజుల ముందు మాత్రమే జారీ చేస్తారు. అడ్మిట్ కార్డులు, పరీక్షలకు సంబంధించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసే తప్పుడు వార్తలను అభ్యర్థులు నమ్మవద్దని, కేవలం రైల్వే బోర్డుల అధికారిక వెబ్‌సైట్‌లలోని అప్‌డేట్‌లను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు ఈ సందర్భగా సూచించారు. పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఎన్టీపీసీ (యూజీ) సీబీటీ 1 పరీక్షల షెడ్యూల్‌ 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us