RRB ALP Railway Jobs 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 11,127 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌! టెన్త్‌ పాసైతే చాలు

రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టుల భర్తీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు..

RRB ALP Railway Jobs 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 11,127 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌! టెన్త్‌ పాసైతే చాలు
RRB Assistant Loco Pilot Jobs

Updated on: Apr 28, 2026 | 6:00 AM

రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టుల భర్తీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనుంది. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సికింద్రాబాద్‌తోపాటు అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గోరఖ్‌పూర్, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం.. రైల్వే ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతిలో ఉత్తీర్ణతతతో పాటు సంబంధిత విభాగాలు, ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2026 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయసులో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్ 14, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష (సీబీటీ1, సీబీటీ 2), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.19,900 చొప్పున ప్రారంభ వేతనంతోపాటు ఇతర అలవెన్స్‌లు అందిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మే 15, 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 14, 2026.

ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ 2026 పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us