AP EAPCET 2026 Registration: ఏపీ ఈఏపీసెట్‌ 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..

AP EAMCET 2026 registration deadline: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్‌ ప్రొఫెషనల్‌ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికిగానూ అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 (ఈఏపీసెట్‌) నోటిఫికేషన్‌..

AP EAPCET 2026 Registration: ఏపీ ఈఏపీసెట్‌ 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
Andhra Pradesh EAPCET Registration

Updated on: Mar 15, 2026 | 4:09 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్‌ ప్రొఫెషనల్‌ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికిగానూ అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 (ఈఏపీసెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఎలాంటి ఆలస్య రుసుములేకుండా దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తోంది. ఇప్పటి వరకు ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు మార్చి 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రూ 1000 ఆలస్య రుసుముతో మార్చి 21 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. అలాగే మార్చి 25వ వరకు రూ.2 వేల ఆలస్య రుసుముతో, మార్చి 23వ వరకు రూ.4 వేల ఆలస్య రుసుముతో, ఏప్రిల్ 3వ వరకు రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు వీలు కల్పిస్తారు.

ఈ క్రమంలో ఎలాంటి ఆలస్య రుసుములేకుండానే మార్చి 17 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా ఈ ఏడాది కూడా ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు మే 12 నుంచి 20 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. యేటా ఈ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్ధులు హాజరవుతుంటారు. ఈ ఏడాది కూడా భారీగానే విద్యార్ధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈఏపీసెట్‌ హాల్‌ టికెట్లు ఏప్రిల్‌ 28 నుంచి అందుబాటులో ఉంటాయి. ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు మే 12, 15, 18 తేదీల్లో, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షలు మే 19, 20 తేదీల్లో జరగనున్నాయి.

దరఖాస్తుకు ఎవరు అర్హులంటే?

ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపులో ఇంటర్మీడియట్‌ కనీసం 25 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందినా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.800, బీసీ అభ్యర్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ.700 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఈఏపీ సెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా బీఈ, బీటెక్‌, బీఎస్సీ, బీఫార్మసీ, ఫార్మ్‌డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us