Registration process for ICAI May 2022 exams began: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మే 2022 సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సోమవారం (ఫిబ్రవరి 21) ప్రారంభించింది. ఈ ఏడాది మేలో జరిగే చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ icai.orgలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసీఏఐ నిర్వహించే సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 13తో ముగుస్తుంది. ఆలస్య రుసుముతో మార్చి 20వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. కాగా చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫౌండేషన్ పరీక్షలు ఈ ఏడాది మే 23న ప్రారంభమై, మే 29 వరకు నిర్వహించబడతాయి. ఇక గ్రూప్ 1 ఇంటర్మీడియట్ పరీక్షలు మే 15న ప్రారంభమై, మే 22 వరకు జరుగుతాయి. గ్రూప్ II పరీక్షలు మే 24న ప్రారంభమై, మే 30 వరకు జరగనున్నాయి.
సీఏ ఫైనల్ కోర్స్ గ్రూప్ 1 పరీక్షలు మే 14 నుంచి మే 21 వరకు జరుగుతాయి. గ్రూప్ II పరీక్షలు మే 23 నుంచి మే 29, 2022వరకు జరుగుతాయి. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అసెస్‌మెంట్ పరీక్ష మే 14 నుంచి మే 17 జరగనున్నట్లు ఐసీఏఐ తెల్పింది.
ICAI CA exam 2022కు రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకోవాలంటే..
Also Read: