RBI Medical Consultant Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్, రెగ్యులేటరీ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India).. మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల (Medical Consultant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు
అర్హతలు: ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అల్లోపతిక్ మెడిసిన్ విధానంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొంది ఉండాలి. జనరల్ మెడిసిన్‌లో పీజీ డిగ్రీ చేసిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో 2 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: రీజినల్ డైరెక్టర్, హెచ్‌ఆర్‌ఎం విభాగం, రిక్రూట్‌మెంట్ సెక్షన్, ఆర్‌బీఐ, ముంబాయి-400001.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2022
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: