AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువతకు భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశాలు.. RRB సెక్షన్‌ కంట్రోలర్‌ నోటిఫికేషన్‌ 2026 విడుదల

RRB Section Controller Recruitment 2026: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

యువతకు భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశాలు.. RRB సెక్షన్‌ కంట్రోలర్‌ నోటిఫికేషన్‌ 2026 విడుదల
RRB Section Controller Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 06, 2026 | 5:04 PM

Share

హైదరాబాద్‌, జులై 6: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు కీలక అప్‌డేట్ జారీ చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టుల భర్తీకి త్వరలో మరో నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌బీ సెక్షన్‌ కంట్రోలర్‌ (CEN No.03/2026) పోస్టులకు సంబంధించి షార్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. షార్ట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జులై 15 నుంచి మొదలవనుంది. ఆగస్టు 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా జులై 1, 2026వ తేదీ నాటికి వయోపరిమితి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఓబీసీ దివ్యాంగులకు 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ దివ్యాంగులకు 15 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు అందుతుంది. దరఖాస్తు రుసుము కింద మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EBC) అభ్యర్థులు రూ.250, ఇతర జనరల్ అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. సీబీటీ పరీక్షకు హాజరైన వారికి రూ.400 రిఫండ్‌ చేస్తారు.

RRB రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తులు

ఈ నోటిఫికేషన్‌తోపాటు జూన్‌ 30న వివిధ విభాగాల్లో మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జులై 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతల కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు భర్తీ చేసే ఈ పోస్టులకు రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!