PGIMER Recruitment 2022: ఇంటర్/డిగ్రీ అర్హతతో.. పీజీఐఎమ్ఈఆర్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

|

Mar 21, 2022 | 8:13 PM

భారత ప్రభుత్వ సంస్థ అయిన చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్ అండ్‌ రీసెర్చ్‌ (PGIMER) ఒప్పంద ప్రాతిపదికన..

PGIMER Recruitment 2022: ఇంటర్/డిగ్రీ అర్హతతో.. పీజీఐఎమ్ఈఆర్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
Pgimer
Follow us on

PGIMER Chandigarh Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్ అండ్‌ రీసెర్చ్‌ (PGIMER) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 7

పోస్టుల వివరాలు: జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్ కమ్ ఫీల్డ్ అటెండెంట్, రీసెర్చ్ అసోసియేట్ కమ్ ల్యాబ్ సూపర్‌వైజర్, డైటరీ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్ (10+2), బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంతో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అడ్రస్‌: The Office of Head, Department of internal medicine, PGI, Chandigarh (block F, 4th floor, Nehru Hospital).

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్: saltfortif ication pgi@gmail.com

దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

RBI Assistant Exam 2022: ఆర్బీఐ అసిస్టెంట్ మెయిన్స్ 2022 హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..