AP govt jobs 2026: ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ లింక్‌ ఇదే

ఏపీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు గుంటూరు జోన్ పరిధిలోని పల్నాడు జిల్లాలో పిడిగురాళ్ల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 150 స్టాఫ్ నర్స్ పోస్టులను..

AP govt jobs 2026: ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ లింక్‌ ఇదే
Palnadu Staff Nurse Jobs

Updated on: Mar 17, 2026 | 7:36 PM

ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు గుంటూరు జోన్ పరిధిలోని పల్నాడు జిల్లాలో పిడిగురాళ్ల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 150 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఫ్యామిలీ వెల్ఫేర్ గొల్లపూడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 17, 2026 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను మార్చి 25, 2026 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఈ నియామకాలు తాత్కాలికంగా నిర్వహించబడతాయని అధికారులు పేర్కొన్నారు. విద్యార్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

గుంటూరు జోన్‌ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి స్టాఫ్‌ నర్స్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us